అమరావతికి మరో మణిహారం..

ఆంధ్రా రాజధాని వైపు ప్రపంచమంతా చూస్తోంది. అదో అవకాశాల థామంగా కనిపిస్తోంది. నిర్మాణానికి ముందే చరిత్ర సృష్టిస్తున్న అమరావతిలో ఇప్పుడు మరో భారీ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అమరావతిలో కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్.. సీఐఐ ఆధ్వర్యంలో దాదాపు వంద ఎకరాల్లో భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు.

ఈ విషయాన్ని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు నౌషద్ ఫోర్బ్స్ హైదరాబాద్ లో వెల్లడించారు. ఈ నిర్మాణ పనులు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నా ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాన్ని అక్కడ చేపడతామన్న నౌషద్ మీడియాకు తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన సీఐఐ యన్యువల్ మీట్ లో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో కలిసి నౌషద్ ఈ కామెంట్స్ చేశారు.

amaravthi

అమరావతిలో వంద ఎకరాల్లో భారీ కన్వెన్షన్ సెంటర్..

అమరావతిలో సీఐఐ ఆధ్వర్యంలో సీఐఐ ఎక్సలెన్సీ సెంటర్ నిర్మాణంలో భాగంగా భారీ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిక మేరకు తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కన్వెన్షన్ సెంటర్ భారతీయ పరిశ్రమల సమాఖ్యకు ప్రధాన ప్రదర్శనశాలగా ఉండబోతోందన్నారు. దేశంలో సీఐఐ తొమ్మిది ఎక్సలెన్సీ కేంద్రాలు నిర్వహిస్తోందని పదో కేంద్రంగా అమరావతి లో ఏర్పాటు చేస్తున్నది దేశానికి ప్రధాన కేంద్రంగా ఉండబోతుందన్నారు.

పరిశ్రమల సమాఖ్యకు సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో దేశానికే దిశానిర్దేశం చేయగలిగే స్థాయిలో ఇంక్యుబేషన్ సెంటర్, యూనివర్సిటీల నిర్మాణాన్ని కూడా అమరావతి, విజయవాడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామని చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం వంద ఎకరాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. అంటే హైదరాబాద్ హెటెక్స్ ను మరపించే కన్వెన్షన్ సెంటర్ అమరావతిలో ఏర్పాటుకాబోతుందన్నమాట.

Total Views: 4734 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

మొహాలీలో రోహిత్ షో

మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు