సినిమా కోసం అప్పుల పాలయ్యాను : యాంకర్ రవి

బుల్లితెరపై యాంకర్ గా ఫేమ్ సంపాదించుకొన్న రవి.. హీరోగా వెండి తెరపై”ఇది నా ప్రేమ కథ”తో అడుగు పెడుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ రిలీజై చాలా కాలం అయ్యింది. కానీ ఇప్పటివరకూ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించుకోలేదు.. దీంతో సోషల్ మీడియాలో రవిని.. మీ సినిమా టీజర్ రిలీజ ఎప్పుడో జరుపుకొన్నది.. కానీ ఇప్పటి వరకూ సినిమా రిలీజ్ కాలేదు.. అసలు సినిమా రిలీజ్ అవుతుందా…? లేదా..? అని అడుగు తున్నారు.. నెటిజన్స్ నా సినిమాపై సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం అంటూ రవి వివరణ ఇచ్చాడు.

నేను సినిమాల్లోకి అడుగు పెట్టక ముందు సినిమా తీయడం చాలా కష్టం అనుకున్నా.. కానీ ఇప్పుడు సినిమా తీయడం సులభమే.. కానీ రిలీజ్ కష్టమే అని తెలిసింది.. మాది చిన్న సినిమా కావడంతో చాలా ఇబ్బందులు ఉన్నాయి అని రవి చెప్పాడు.. ఈ సినిమాను తెరకెక్కించడం కోసం అప్పు చేశా.. భూమి అమ్మాను.. ఇంటి ని కూడా తాకట్టు పెట్టాను దీంతో సినిమాను సరైన సమయంలో రిలీజ్ చేసుకొని సినిమా బతికించుకొంటాను.. అప్పుడే మేము అనుకున్నది సాధిస్తాం… ఒక నటుడుగా అందరూ నన్ను చూడాలి.. ఆదరించాలి.. నిర్మాతగా అనుకున్న డబ్బులు రావాలి.. అందుకే మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నా.. దీంతో వెండి తెరపై ఇది నా ప్రేమ కథ రావడానికి లేట్ అవుతుంది అని యాంకర్ రవి చెప్పాడు.

Total Views: 1378 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘సవ్యసాచి’ సింపుల్ రివ్యూ

నాగ చైతన్య ,నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన