యాంకర్ ప్రదీప్‌కు జైలు శిక్ష తప్పదా?

హైదరాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ప్రముఖ యాంకర్ ప్రదీప్. న్యూ ఇయర్ పార్టీలో ఫుల్లుగా మందు కొట్టి.. వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని రోడ్ నెంబర్ 45లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు దొరికిపోయాడు. ప్రదీప్ పార్టీలో ఫుల్లుగా మందుకొట్టినట్టు స్పష్టంగా తెలుస్తుంది. TS 07 EU 6666 బీఎండబ్ల్యూ కారులో వస్తున్న ప్రదీప్‌ను పోలీసులు ఆపారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టు నిర్వహించగా.. 178 పాయింట్లు పాయింట్లు చూపించింది. అంటే ఏ స్థాయిలో మద్యం పుచ్చుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపరచనున్నారు.కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం యాంకర్ ప్రదీప్‌కు జైలుశిక్ష పడే అవకాశం ఉందంటున్నాయి పోలీసు వర్గాలు

తాగి వాహనాలు నడపొద్దంటూ హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. న్యూ ఇయర్ పార్టీల సందర్భంగా కొన్ని క్యాబ్‌లు కూడా ఉచిత సర్వీసులు అందించాయి. అయినా సరే తాగి వాహనాలు నడపడంపై పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పది మందికి చెప్పే వారు కూడా ఇలా చేయడం ఏంటని నిరాశను వ్యక్తం చేశారు. అయితే, పోలీసుల తనిఖీల సందర్బంగా బ్రీత్ ఎనలైజర్ టెస్టుకు మొదట ప్రదీప్ నిరాకరించినట్టు తెలుస్తోంది. అయితే, తమ పని తాము చేశామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Total Views: 576 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

జగన్ కి షేక్ హ్యాండ్ కాదు హ్యాండ్ ఇచ్చినట్టే?

గుంటూరు రాజకీయాల్లో అగ్రనేత, బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ.