అనంతపురం గబ్బర్ సింగ్!

ఈ మధ్య కాలంలో  అన్ని రాజకీయ పార్టీ నాయకులు ,  ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు  పోలీ సులపై, పోలీస్ వ్యవస్థ పై  అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని  అలాంటివి   మానుకోవాలని   అనంతపురం జిల్లా  పోలీస్ సంఘం హెచ్చరించింది. అనంతపురం నగరంలోని పోలీస్ సంఘం కార్యాలయంలో పోలీస్ సంఘం విలేఖరుల సమావేశం నిర్వహించింది.  అనంతపురం జిల్లాలో వున్న ఫ్యాక్షన్, నక్సలిజం, సోడో నక్సలిజాన్ని ఒంటి చేతితో  నిర్మూలించిన   ఘనత  జిల్లా ఫోలీస్ వ్యవస్థ కు దక్కుతుందని జిల్లా పోలీస్ సంఘం సెక్రటరీ గోరంట్ల మాదవ్ తెలిపారు. ఈ మధ్య కాలంలో తమ పై కొంత మంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు  తమ మనోభావాలను దెబ్బతీనేలా మాట్లాడుతున్నారని అలాంటి వారి నాలుక తెగ్గోస్తామని ఆయన హెచ్చరించారు. తమ జీవితాలను పణంగా పెట్టి తమ విధులను నిర్వర్తి స్తున్నామని ఆయన గుర్తు చేశారు.  కొన్ని సంఘటనల వద్ద ప్రజలతో పాటు మేము కూడా అవేశంగా  ముందుకు పోవడానికి వుండదని  అలా వెళితే..  భారీ స్థాయిలో నష్టం కలిగే అవకాశం వున్నందున  వెనక్క తగ్గల్సి వుంటుందని ఆయన తెలిపారు. ఎవరు అయితే  పోలీసులును అనుచిత వ్యాఖ్యలతో భాద పెడుతున్నారో వారి విజ్ఝతికే వదలేస్తున్నామని వారు వెల్లడించారు. ఇప్పటి నుంచి ఎవ్వరైనా సరైనా ఏ రాజకీయ పార్టీ నాయకుడు , ప్రజా ప్రతినిధి అయిన  తమ మనోభావాలను,  పోలీస్ వ్యవస్థ ను కించ పరిచేవిధంగా చేస్తే ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు.

Total Views: 559 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

దమ్ముంటే పంచాయితీ ఎన్నికలకు పెట్టండి : పవన్ సవాల్!

తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ పై జనసేన’ కవాతు ముగిసింది.