దుమ్మురేపుతున్న చిరు లేటెస్ట్ మూవీ సాంగ్

untitled-1దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘ఖైదీ నంబర్‌ 150’. ఈ మూవీకి సంబంధించిన ఓ పాట ‘అమ్మడూ.. లెట్స్‌ డు కుమ్ముడు’ అనే సాంగ్‌ టీజర్‌ ను మూవీ యూనిట్ రిలీజ్‌ చేసింది. యూట్యూబ్‌లో అప్ లోడ్ ఇలా చేశారో లేదో అంతే.. మెగా అభిమానులు ఈ టీజర్ ను ఓ రేంజ్ లో వీక్షిస్తున్నారు. అందులోనూ మెగాస్టార్ మూవీ అంటే ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు.

మెగాస్టార్‌  ‘ఖైదీ నంబర్‌ 150’. ఇందులోని ‘అమ్మడు..’ అనే పాటను చిత్రం బృందం ఆదివారం విడుదల చేసింది. ఈ పాటను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ స్వయంగా రచించి ఆలపించారు. దేవిశ్రీ శైలికి తగినట్లుగానే పాట కూడా హుషారెక్కిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ నెల 25న ఆడియోను జవనరి తొలివారంలో ప్రీ-రిలీజ్‌ వేడుకను నిర్వహించనున్నారు.

వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. సురేఖ కొణిదెల చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కాజల్‌ కథానాయికగా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతికి ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Total Views: 1628 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బిగ్‌బాస్‌ వాయిస్‌ ఎవరిదో తెలిసిపోయింది..!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ట్రేండింగ్ టాపిక్‌ బిగ్‌బాస్‌. సీజన్‌ వన్