వేలు ముడుచుకోవాలి!. .నోరు మూసుకోవాలి!

allu-arjunమెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా సినీ హీరో అల్లు అర్జున్ కూడా పరోక్షంగా అస్త్రాలు సంధించారు. ఎన్నో మాట్లాడలేని విషయాలు, చెప్పలేని విషయాలకు ఈ సినిమానే సమాధానమన్నారు. ఇప్పటివరకు ఎత్తిన ప్రతీ వేలు ముడుచుకోవాలని. జారిన ప్రతీ నోరు మూసుకోవాలని ఘాటుగా హెచ్చరించారు. ఖైదీ నెంబర్‌ 150 అన్నింటికి సమాధానం ఇస్తుందన్నారు. ఈ సినిమా ఒక స్వీట్‌ వార్నింగ్‌ కావాలని కోరుకొంటున్నానని బన్నీ చెప్పారు. చిరంజీవి నుంచి నేర్చుకోవాల్సింది.. డ్యాన్స్, ఫైట్లు కావని సంస్కారమని చెప్పుకోచ్చాడు. ఆ సంస్కారంతోనే మాట్లాడుతోన్నానన్నారు. సంక్రాంతికి మరో సినిమా విడుదలౌతోందని. ఆ సినిమా కూడా హిట్‌ కావాలని చిరు అభిమానుల తరుపున కోరుకొంటున్నాని చెప్పాడు.తాను ఎక్కువగా మాట్లాడితే ఎమోషనల్‌ అవుతానని. సంస్కారంగానే మాట్లాడనని అనుకొంటున్నానని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.

Total Views: 1347 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

జాతీయ అవార్డు విజేతలు వీరే

2017 సంవత్సరానికి గానూ జాతీయ సినిమా అవార్డులను కేంద్రం ప్రకటించింది.