‘హలో’ మూవీ రివ్యూ & రేటింగ్

అక్కినేని మూడోత‌రం వారసుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన హీరోల్లో అక్కినేని అఖిల్ ఒక‌రు. తొలి సినిమా `అఖిల్‌` ఆశించిన మేర ఆక‌ట్టుకోక‌పోయినా..రెండో చిత్రం విష‌యంలో అఖిల్ చాలా స‌మ‌యాన్ని తీసుకున్నాడు. దాదాపు రెండేళ్ల పాటు స‌మ‌యం తీసుకుని అక్కినేని ఫ్యామిలీకి మ‌ర‌చిపోలేని సినిమాను అందించిన డైరెక్ట‌ర్ విక్రమ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా అనౌన్స్ చేయ‌గానే సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఈ అంచ‌నాలను సినిమా అందుకుందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం…

క‌థ‌:
శీను(అఖిల్‌) అనాథ. జున్ను (కల్యాణి) ఓ పెద్దింటి అమ్మాయి. చిన్నప్పుడే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. శీను సంగీతం అంటే జున్నుకి ఎంతో ఇష్టం. అనుకోకుండా జున్ను కుటుంబందిల్లీ వెళ్లిపోతుంది. ఒకరికొకరు సోల్‌మేట్‌గా భావించిన ఆ ఇద్దరూ ఒకరికోసం మరొకరు ఎదురుచూస్తుంటారు. పదిహేనేళ్ల తర్వాత జున్ను కుటుంబం అమెరికా వెళ్లిపోవాలనుకుంటుంది. జున్ను ఎలాగైనా శీనుని కలవాలని హైదరాబాద్‌ వస్తుంది. మరి వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు. అవినాశ్‌, ప్రియలుగా ప‌రిచ‌య‌మైన‌ శీను, జున్నులు ఒక‌రినొక‌రు ఎలా గుర్తుపట్టారు? వంటి విషయాలు తెరపైనే చూడాలి.

విశ్లేషణ :
తొలి సినిమాతోనే మాస్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప‍్రయత్నం చేసి బోల్తా పడ్డ అఖిల్ రెండో సినిమాలో మాత్రం లవర్ బాయ్ ఇమేజ్ కోసం ప్రయత్నించాడు. నటుడిగా మంచి పరిణతి కనబరిచాడు. రమ్యకృష్ణ, జగపతి బాబుల కాంబినేషన్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో అఖిల్ నటన కంటతడిపెట్టిస్తుంది. యాక్షన్ సీన్స్ లో అఖిల్ మూమెంట్స్ హాలీవుడ్ హీరోలను గుర్తు చేస్తాయి. హీరోయిన్ గా నటించిన కళ్యాణీ ప్రియదర్శన్ కు ఇది తొలి సినిమా అంటే నమ్మలేం. అంతలా ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్ తో పాటు నటనతోనూ ఫుల్ మార్క్స్ సాధించింది. అమ్మా నాన్నలుగా జగపతిబాబు రమ్యకృష్ణలు సూపర్బ్. వాళ్ల పర్ఫామెన్స్ తో సినిమా స్థాయిని పెంచారు. విలన్ గా అజయ్ ది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో తనదైన నటనతో మెప్పించాడు. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.

బాబ్‌ బ్రౌన్‌ సమకూర్చిన పోరాట ఘట్టాలు, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం, వినోద్‌ కెమెరా పనితనం, రాజీవ్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్‌ ఇలా ప్రతీదీ సినిమా స్థాయిని పెంచేవే. దర్శకుడు విక్రమ్‌ ఇదివరకులా సంక్లిష్టమైన కథను ఎంపికచేసుకోలేదు. ఒక మామూలు కథనే అనుభూతిని, భావోద్వేగాలతో పండించడంలో మాత్రం సఫలమయ్యాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మాణ విలువలు వెండితెరపై అడుగడుగునా కనిపిస్తాయి.

రేటింగ్‌: 3.0

Total Views: 1703 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు