వివాదాస్పదంగా డీసీపీ గంగిరెడ్డి తీరు!

తెలంగాణ పోలీసుల్లో కొంతమంది రాష్ట్ర..ఖాకీ..పరువు తీస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని సర్కార్ చెబుతున్నా..పలు ఘటనలు అది నిజం కాదని నిరూపిస్తున్నాయి. తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ చేసిన ఫిర్యాదుపై డీసీపీ వీరంగం సృష్టించాడు. ఏకంగా ఫిల్మ్ డైరెక్టర్ ను పీఎస్ లోనే లాగి కొట్టి…తన్నాడు..ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సినీదర్శకుడు యోగి తనపట్ల దురుసుగా ప్రవర్తించాడని, అసభ్య మెసేజ్ లతో భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని హారిక అనే యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించిన తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె పేర్కొంది. నిందితుడు యోగిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగా అతను అటు యువతిని, ఇటు పోలీసులను దుర్బాషలాడినట్టు సమాచారం. దీంతో సహనం కోల్పోయిన అదనపు డీసీపీ గంగిరెడ్డి యోగిన స్టేషన్ లో చితకబాది వదిలేయగా మరింత రెచ్చిపోయిన యోగి పోలీసులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు యోగి ఆగడాలు మరింత పెరిగిపోవటంతో పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు.ప్రస్తుతం డీసీపీ వీరంగానికి సంబంధించని దృశ్యాలు వైరల్ అవడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించే అవకాశం ఉంది. ఫిల్మ్ డైరెక్టర్ యోగి కూడా మీడియా ముందుకొచ్చే అవకాశం ఉంది.

Total Views: 534 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

భార్యకు ఎలా దొరికిపోయాడు అంటే..!

కట్టుకున్న భార్య, కూతురిని వదిలి మరో యువతితో వివాహేతర సంబంధం