యానాంలో న‌గ్మా త‌క‌దిమితోం!

nagmaaక‌థానాయిక‌గా ఓ ఊపు ఊపిన హాట్‌గాళ్‌- న‌గ్మా ఉన్న‌ట్టుండి యానాంలో క‌ల‌క‌లం రేప‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఈ అరేబియ‌న్ గుర్రం (బిరుదు) యానాంలో ప‌ర్య‌టించి జ‌నాల్ని క‌ట్టిప‌డేశారు. అయితే ఈ ప‌ర్య‌ట‌న పొలిటిక‌ల్ ప‌ర్య‌ట‌న‌. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ఇలా వ‌చ్చి క‌ల‌క‌లం రేపింది సుమీ!

90ల‌లో చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ వంటి స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన న‌గ్మా ఆ త‌ర్వాత కెరీర్ చ‌ర‌మాంకంలో అజారుద్దీన్‌తో ప్రేమాయ‌ణం సాగించింద‌న్న పుకార్ల‌లో నానింది. ఆ త‌ర్వాత కొంత కాలం సినిమా వార్త‌లకు దూర‌మైంది. ఇటీవ‌లి కాలంలో న‌గ్మా పేరు పాలిటిక్స్‌లో వినిపించింది. ఇప్పుడు ఉన్న‌ట్టుండి మ‌రోసారి అదే రీజ‌న్‌తో బైటికొచ్చింది. యానాంలో కాంగ్రెస్ త‌ర‌పున న‌గ్మా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వ‌చ్చింది. న‌గ్మా నిలువెత్తు రూపం యానాం ప్ర‌జ‌ల్ని క‌ట్టిప‌డేసింది. ఆమె హావ‌భావాలు, ప్ర‌సంగంలో స్పీడ్ ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకున్నాయ‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావును భారీమెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. మ‌రి న‌గ్మా మాట విని జ‌నం ఓటేస్తారో లేదో చూడాలి.

Total Views: 497 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే