భువనేశ్వరి కొడుకు నిర్వాకం చూసారా?

సంచలనాలకు కేంద్రబిందువు నటి భువనేశ్వరి. ఆమె కొడుకు కళాశాల విద్యార్థినిని పెళ్లి పేరుతో టార్చర్‌ పెట్టిన కేసులో అరెస్ట్‌ అయ్యి కటకటాలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకెళ్లితే బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఓ ఫిమేల్ స్టూడెంట్ ని సోషల్ మీడియాలో వేధిస్తూ.. తనను పెళ్లి చేసుకోకపోతే కిరోసిన్ పోసి తగలబెడతానంటూ బెదిరించాడు. ఆమె ఇంటికి వెళ్లి ఇంటిముందున్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశాడట. పైగా .. ఆమె చదువుతున్న కాలేజీకి కూడా వెళ్లి అక్కడా గొడవ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుపై తిరుమంగళం పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.

శ్రీనివాసన్ కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.తమ ఇంట్లో పని చేసేందుకు శ్రీలంక నుంచి ఓ యువతిని పిలిపించుకున్న భువనేశ్వరి, ఆపై ఆమెతోనే తన కుమారుడి పెళ్లి చేసినట్టు తెలుస్తోంది. ఆపై కొడుకుతో కలిసి ఆ అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించినట్టు పోలీసు కేసు కూడా ఆమెపై నమోదైంది. ఈ కేసు మద్రాసు హైకోర్టులో ప్రస్తుతం విచారణ దశలో ఉండటం గమనార్హం. ఇప్పుడు తాజాగా కుమారుడి నిర్వాకం భువనేశ్వరిని మరోసారి వార్తల్లో నిలిపింది.

Total Views: 1727 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రాజేష్‌ని కాపాడుతున్న హాస్పిటల్ బిల్!

క్రైం స్టోరీని తలపించే సుధాకర్ రెడ్డి హత్యోదంతం.. బెడ్‌పైన ఉన్న