జగన్, పవన్ .. ‘ఆర్కే’ కామెంట్‌ అద్భుతం!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ప్రతి వారం కొత్త పలుకు పేరుతో ఓ సుదీర్ఘమైన వ్యాసం రాస్తారు అన్న సంగతి తెలిసిందే .. తాజాగా ఆయన రాసిన వ్యాసం సర్వత్రా చర్చనీయం అయింది. అయితే ఆ చర్చ ఆయన రాసిన ఆర్టికల్ పైన కాదు .. ఆయన నిబద్ధతపైన.. విషయం ఏంటి అంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కలిసి పోటీ చేస్తున్నారు అన్నది ఆర్కే కొత్త పలుకు.

ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీలు ఎవరికి వారే ఎడ మొహం పెడ మొహం అన్న రీతిలో ముందుకుపోతున్నారు అన్నది అందరికి తెలిసిన సత్యం. కానీ చంద్రబాబు అనుకూల మీడియాగా పేరున్న ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ ఆర్కే మాత్రం రాబోయే ఎన్నికల్లో పవన్, జగన్ లు కలిసి పోటీ చేస్తారని అంటున్నారు.

అందుకు బీజేపీ డైరెక్షన్ చేస్తోందని ఆరోపించారు. వీరిద్దరి మధ్యన లోపాయికారీ వ్యవహారం నడుస్తోందనే తన మాటల్ని బలపరుచుకునేందుకు వైసీపీ ఎంపీల రాజీనామా, జగన్ అధికార కాంక్ష, బాబు ప్రభుత్వాన్ని పడగొడతానని పవన్ చేసిన సవాల్ వంటి పలు కారణాల్ని భూతద్దంలో పెట్టి మరీ విశ్లేషించారు ఆర్కే.

పవన్ పార్టీ పెట్టిన ఆరంభంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఆరోపణలున్న జగన్ తో చేతులు కలిపేది లేదని స్పష్టం చేశాడు. ఆ మాట ప్రకారమే ప్రతి సభలోను ప్రతిపక్షంగా వైకాపా వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. ఇక ఇన్నాళ్లు పవన్ పై పెద్దగా స్పందించని జగన్ కూడ మొన్నా మధ్య నోరుజారి పొరపాటున సున్నం పెట్టుకున్నాడు. ప్రస్తుతం కాదు కదా భవిష్యత్తులో కూడా వీరి నడుమ దోస్తీకి ఛాన్సే లేదు. నాయకులతో పాటే ఈ రెండు పార్టీల కార్యకర్తల్లో సైతం తీవ్రమైన అభిప్రాయ బేధాలున్నాయి. ఇప్పటికే అవకాశవాద రాజకీయాలతో నలిగిపోయి ఉన్న ఏపీ జనం కూడ ఏమాత్రం ఊహించని వీరి కలయికను అస్సలు సహించరు. ఒకవేళ జనాన్ని కాదని కలిస్తే అంతకంటే తెలివి తక్కువ పని మరొకటి ఉండదు. ఈ విషయం పవన్, జగన్ లకు తెలియనిదేమీ కాదు. ఇన్ని వైరుధ్యాల నడుమ పవన్, జగన్ లకు దోస్తీ ఉందని, దాన్ని జనంపై రుద్దడానికి ఆర్కే చేసిన కొత్త పలుకు చెత్తగా ఉంది.

Total Views: 142 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే