రాత్రికి రాత్రి మారిన ఏపీ అధికార చిహ్నం!

రాత్రికి రాత్రి మారిపోయిన ఏపీ అధికార చిహ్నం. ‘పూర్ణకుంభం’ కాస్తా ‘పూర్ణఘటం’ గా మారింది. ఏపీ అధికార చిహ్నం ఏది అనిప్రశ్నించగానే తడుముకోకుండా అందరు చెప్పేది ఒక్కటే అది ‘పూర్ణ కుంభం’ అని ఇప్పుడు అది మర్చి ఆ స్థానంలో ‘పూర్ణఘటం’ చేర్చింది ఏపీ సర్కార్. వివరాల్లోకి వెళితే..

1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌గా అవతరించినప్పుడు ఉన్న అసలు సిసలైన అధికార చిహ్నాన్ని తిరిగి తెరపైకి తీసుకొచ్చారు.రాష్ట్ర అధికారిక చిహ్నంపై కొందరు ప్రముఖులు లోతుగా అధ్యనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయగా.. ప్రభుత్వం పురావస్తు, చారిత్రక నిపుణులతో చర్చించి.. 1954 నాటి నోటిఫికేషన్‌ ప్రకారం, ఈ చిహ్నం ఆవిష్కరించినపుడు అందులో ఉన్నది ‘పూర్ణఘటం’ అని తిరిగి అధికారిక చిహ్నంలో చేర్చాలని నిర్ణయించింది. దీని ప్రకారం… ధర్మచక్రంలో 64 గీతలు, పూర్ణఘటం చిత్రాన్ని చేర్చారు. నాలుగు సింహాల బొమ్మను అలాగే ఉంచారు. ఈ స్వాతంత్ర వేడుకల నుండి పూర్ణఘటం చిహ్నాన్ని అధికారికంగా చేసుకుంది ఏపీ ప్రభుత్వం. దీంతో పాటు అధికార చిహ్నం పైభాగాన ఆంగ్లంలో ఉండే ‘గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’ వ్యాఖ్యలను కూడా ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అని తెలుగులోకి మార్చారు. ఆంగ్లంలో కిందివైపు ముద్రించారు. సత్యమేవ జయతే అన్న సూక్తిని కూడా తెలుగులోకి మార్చి ముద్రించారు.

ఇంతకీ ఈ పూర్ణకుంభం.. పూర్ణఘటం ఏమిటి? వ్యత్యాసం ఏమిటంటారా?పూర్ణకుంభం అంటే.. దేవాలయాలకు వెళ్లినప్పుడు… ప్రముఖులు వచ్చినప్పుడు స్వాగతం పలకటానికి వినియోగించేది పూర్ణకుంభం. దీనికి ఆకులు లేకుండా ఉండేదే పూర్ణ ఘటం. అసలు పూర్ణఘటంగా చిహ్నాన్ని మొదట్లో ఎందుకు పెట్టారన్న విషయంలోకి వెళితే.. ధర్మచక్రం మధ్యలో ఉన్న పూర్ణఘటాన్ని విదికుడు అనే చర్మకారుడు చెక్కినట్లుగా చరిత్ర చెబుతోంది. దీన్ని అక్షయపాత్రగా అభివర్ణిస్తారు కూడా.తర్వాతి కాలంలో ఈ పూర్ణఘటానికి ఉన్న తామరాకుల్ని తీసేయటం.. అధికారికంగా ఎవరిప్రమేయం లేకుండానే పూర్ణకుంభంగా మార్చేశారు.

Total Views: 51 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘కోడి కత్తి’ కేసు కొత్త మలుపు!

‘కోడి కత్తి’ కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు రహస్య