‘మంగమ్మ’ ఫ్యామిలీ విషయాలు!

hari-tejaత్రివిక్రమ్ ‘అ ఆ’ సినిమాతో సమంత పక్కన ‘మంగమ్మ’గా నటించిన హరితేజ, ఈ సినిమా తర్వాత ప్రేక్షకుల్లో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడిప్పుడే బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఓ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ విషయాలను గురించి తెలిపింది.

‘పెళ్ళయిన నాలుగు రోజుల తర్వాత తన భర్త దీపక్ ప్రవర్తిస్తున్న తీరు పట్ల తానూ ఏడ్చేసానని, వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి నా ఆవేదన అంతా వెలిబుచ్చానని, మగవాళ్ళు అలాగే ఉంటారు, నిదానంగా వాళ్ళే మారతారని అప్పుడు మా అమ్మ సర్దిచెప్పింది గానీ, నిజానికి మారింది తన భర్త కాదు, తానే మారిపోయి దీపక్ రూట్ లోకి వెళ్ళిపోయానని, ఇప్పుడు తనకు కూడా బాగా అలవాటైపోయిందని’ చెప్పుకొచ్చింది.

పెళ్లయిన నాలుగైదు రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం మా ఆయనొస్తాడు.. ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తాడు అని నేను ఎదురు చూస్తుంటే.. రాగానే మంచి ట్రాక్ వేసుకుని, షూస్ వేసుకుని ‘నేను జిమ్‌కు వెళ్తున్నా వస్తావా?’ అనగానే.. జిమ్మా?.. నాలుగు రోజులైందిరా పెళ్లయి అని తిట్టుకుని నేను రాను అని చెప్పి ఇంట్లోనే బాగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. వారమంతా మా అమ్మకు ఫోన్ చేసి బాగా ఏడ్చేదాన్ని. ఏంటమ్మా ఇంత ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా నన్ను ఎక్కడికి తీసుకెళ్లడం లేదు. జిమ్ అని ఎప్పుడూ అక్కడే పడుంటాడు అని మా అమ్మకు కంప్లయింట్ చేసినా.. ‘సర్లెమ్మా.. పర్లేదు. అబ్బాయిలు మెల్లగా మారుతారు.’ అని నాకే క్లాస్ పీకేది. నేనే మెల్లమెల్లగా మారి జిమ్‌కు వెళ్లడం మొదలెట్టా.’’ అని తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టింది హరితేజ.

Total Views: 1754 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అతిలోక సుందరి అంతిమ యాత్ర!

అశేష జనవాహినిని అర్ధశతాబ్ధంపాటు అలరించి, ఎన్నెన్నో మరుపురాని పాత్రల్లో జీవించి