సీఎం చంద్రబాబు భార్యగా మంజీరా!

దివంగత నేత ఎన్.టి.రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “ఎన్టీఆర్ బయోపిక్”. ఈ చిత్రంలో అన్ని విశేషాలే.ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న విషయం..ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ లో పలు అంశాలు చిత్రీకరణ జరిగింది. చిత్రంలో పలు కీలక పాత్రలకు పలువురు సీనియర్ నటీనటులతో పాటు తాజా ఎంట్రీ ఇచ్చిన నటీమణులను కూడా ఎంపిక చేస్తున్నారు.

ఇందులోభాగంగా, ఎన్టీఆర్ అల్లుడు, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి నటించనున్నారు. అలాగే, చంద్రబాబు భార్యగా మంజిమా మోహన్ నటించనుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన చిత్రం “సాహసం శ్వాసగా సాగిపో” అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈమెను చంద్రబాబు భార్య భువనేశ్వరి పాత్రకు ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

అలాగే, అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో ఆయన మనుమడు సుమంత్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్, సావిత్రిగా కీర్తి సురేష్‌లను ఎంపిక చేశారు.

Total Views: 289 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కళ్యాణ్ రామ్ ‘118’ ఫస్ట్‌లుక్!

కేవీ గుహన్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ ఓ చిత్రంలో