షణ్ముఖ ప్రియ మిస్సింగ్!

హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీకి చెందిన షణ్ముఖ ప్రియ(18) ఇంటర్ పూర్తి చేసి యాడ్ ఫిల్మ్ దర్శకుల వద్ద పనిచేస్తుంది.  ఈ క్రమంలో దర్శకుడు కమల్ సేతు ఓ యాడ్ షూటింగ్ నిమిత్తం డార్జిలింగ్‌కు వెళ్లాలని చెప్పడంతో గత నెల 17న తల్లి ఉషాకుమారి షణ్ముఖను ప్లైట్ ఎక్కించింది.  అదే రోజు మధ్యాహ్నం తాను కోల్‌కతాకు చేరుకున్నాని ఆగస్టు 28న తిరిగి వస్తానని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఆతరువాత నుంచి షణ్ముఖ నుంచి ఏ విధమైన ఫోన్ కాల్ లేదు.  వీరు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ అని వస్తుంది.  ఇన్ని రోజులైనా షణ్ముఖ రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బుధవారం ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కాగా తల్లిదండ్రులు ఇద్దరు యువకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Total Views: 1410 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘మసాజ్’ ముసుగులో ఏం జరుగుతుంది?

ఉద్యోగాల పేరుతో కొంత మంది యువతులను ధాయిలాండ్‌తో పాటు మన