పాఠశాల వయసులోనే ప్రేమ పేరుతో ఆత్మహత్య!

ప్రేమ పేరుతో ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు ప్రియురాలు కోసం తగువు లాడుకొని ఆత్మ తీసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకోగా మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

పాఠశాల విద్యా వయసులోనే ప్రేమ పేరుతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఘటనలో ప్రియురాలి కోసం అదే తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులు వాడుకొని మద్యం సేవించి ఒకరిపై ఒకరు పెట్రోలు చల్లుకొని నిప్పంటించుకున్నాడు. విద్యానగర్ కు చెందిన మహేందర్,రవితేజ 10 వ తరగతి విద్యార్థులు, ఒక అమ్మాయి ప్రేమ కోసం పోటీ పడ్డారు తెలిసీ తెలియని వయసులో ప్రేమ పేరుతో గొడవకు దిగారు. స్థానిక మిషన్ కాంపౌండ్ సెయింట్ జోన్స్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నారు ఇద్దరు కలిసి మద్యం సేవించి అదే మత్తులో పెట్రోల్ పోసుక వీరిద్దరూ ఇదే స్కూల్ లో అదే తరగతికి చెందిన ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించారు ఆ అమ్మాయి విషయమై మాట్లాడుకుందమని ఇద్దరు కలిసి చెట్ల పొదల్లో మద్యం సేవించి అదే మత్తులో ఇద్దరు గొడవ పడి పెట్రోల్ పోసికొని నిప్పంటించుకోవడం తో మహేందర్ అక్కడే చనిపోగా మరో విద్యార్థి రవితేజ మాత్రం తీవ్రంగా గాయాలైన పరిస్థితిలో కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

మరోవైపు మృతుడు మహీందర్ తల్లిదండ్రులు మాత్రం తమ అబ్బాయికి తాగుడు అలవాటు లేదని తాగుడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగిన సంఘటన స్థలం తాగుబోతుల అడ్డా నేనని మా అబ్బాయిని మధ్యాహ్నం తన మిత్రుడు ఫోన్ చేయడంతో ఇంటినుండి బయలుదేరి వెళ్ళాడు అని మళ్ళీ తిరిగి రాలేదని మా అబ్బాయిది ఆత్మహత్య కాదని హత్యేనని భావిస్తున్నామని వాళ్ల స్నేహితులని పట్టుకొని విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని మాకు న్యాయం చేయాలని పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు స్కూల్ కు వెళ్లి ప్రిన్సిపాల్ కూడా ఇదే వ్యవహారం పై స్పందిస్తున్నారు మహీందర్ అనే స్టూడెంట్స్ చాలా మంచి స్టూడెంట్ అని స్కూలుకు రెగ్యులర్ గా వస్తుంటాడు అని మద్యం అలవాటు నేను ఇప్పటివరకు చూడలేదని కానీ రవితేజ అనే స్టూడెంటు గతంలో చాక్లెట్ తో పట్టుపడ్డాడు అని నా దృష్టికి వచ్చింది రవితేజ రెగ్యులర్గా స్కూలుకు సరిగా రాడు అని స్పష్టం చేస్తున్నారు.

మొత్తానికి టీనేజ్ వయసులో ప్రేమలో పీకల్లోతు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు చివరికి తమ ప్రాణాలు కోల్పోయిన దుస్థితిపై స్థానికంగా చర్చనీయాంశం కాగా విచారణ పూర్తి స్థాయిలో నిజాయితీగా జరగాలని కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో పూర్తి విచారణ జరిగితే తప్ప వీరి ఆత్మహత్యకు కారణం స్పష్టత తెలిసే అవకాశం లేదు.

Total Views: 558 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నటి భానుప్రియపై పోలీసు కేసు

ప్రముఖ సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్