రంగంలో అమ్మ ఏం చెప్పింది అంటే?

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతున్న లష్కర్ బోనాల్లో అత్యంత కీలకమైన ‘రంగం’ కార్యక్రమం ఇవాళ ఉదయం జరిగింది. బోనాల తర్వాత రోజు జరిగే ఈ ఘట్టంలో స్వర్ణలత అమ్మవారు భవిష్యవాణి వినిపించారు.లష్కర్ బోనాల సందర్భంగా పచ్చి కుండపై నిలబడి, అమ్మవారిని ఆవహించుకుని భవిష్యత్తును చెప్పిన స్వర్ణలత.. ఈ ఏడాది బంగారు బోనం కొంత సంతోషం, కొంత దుఃఖం కలిగించిందన్నారు. ‘ఈ ఏడాది భక్తుల్లో సంతోషం కనపడలేదు. ఆడపడుచులు క్షోభిస్తున్నారు. ప్రజలకు మేలు చేస్తున్నామనుకుంటున్నారుగానీ కీడు చేస్తున్నారు’ అని అన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని, తాను న్యాయం వైపు ఉండి దుష్టులను శిక్షిస్తానని చెప్పారు. ప్రజలంతా తన బిడ్డలేన్న ‘మాతంగి’.. ఈ ఏడాది కోరినన్ని వర్షాలుంటాయని, పాడిపంటలు పండుతాయని అన్నారు.

Total Views: 63 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బ్రేకింగ్ : టీడీపీ పోటీచేసే అభ్యర్థుల వివరాలు ఇవే!

మహా కూట‌మి ఏర్పాటు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ