భీమవరం మావుళ్లమ్మకు ఎన్టీఆర్ తల్లి కానుక!

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గ్రామదేవతగా విలసిల్లుతున్న మావుళ్లమ్మ ఆలయాన్ని సందర్శించిన హీరో ఎన్టీఆర్ తల్లి షాలిని, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వెండి కానుకను అందించారు. తన స్నేహితులతో కలసి ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా అమ్మవారికి షాలిని 350 గ్రాముల బరువైన వెండి పాత్రను కానుకగా అందించారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించిన పురోహితులు ఆశీర్వచనం చదివారు. షాలినీ వచ్చారని తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు పలువురు గుడి వద్దకు రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. 

Total Views: 3283 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కత్రినాకు మేల్‌ వర్షన్ మహేష్ బాబు!

టాలీవుడ్ లో ఈ జనరేషన్‌ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన నటుడు